Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేనేజర్ ను వెనకేసుకొస్తున్న నటి అమలాపాల్... తప్పుడు వార్తలు రాస్తే కేసు వేస్తానని హెచ్చరిక

  • అమలాపాల్ ను కలిసేందుకు మేనేజర్ సాయం
  • పోలీసుల విచారణలో అళగేశన్ వెల్లడి
  • దీనిపై మీడియాలో వార్తలు... అవాస్తవమన్న అమలాపాల్
లైంగికంగా వేధిస్తున్నాడంటూ మలేషియాకు చెందిన ఓ డాన్స్ స్కూల్ నిర్వాహకుడు అళగేశన్ పై ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి అమలాపాల్, ఈ కేసులోకి తన మేనేజర్ ప్రదీప్ కుమార్ ను లాగడంపై మండిపడుతోంది. అమలాపాల్ ను కలిసేందుకు ఆమె మేనేజర్ ప్రదీప్ కుమార్ తనకు సాయం చేశాడంటూ పోలీసుల విచారణలో అళగేశన్ చెప్పడంతో దీనిపై మీడియాలో ప్రముఖ కథనాలు వెలువడ్డాయి.

తనకు అళగేశన్ ఎవరో తెలియదని ప్రదీప్ కుమార్ స్పష్టం చేయగా, నటి అమలాపాల్ కూడా ప్రదీప్ కుమార్ ను వెనకేసుకొచ్చారు. తన మేనేజర్ గురించి మీడియా సంస్థలు కొన్ని తప్పుగా రాస్తున్నాయని, ఇలా చేస్తే కోర్టులో కేసు కూడా వేస్తానని హెచ్చరించారు. కేసు విచారణలో ఉన్నందున తాను మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
amalapal

More Telugu News